చెన్నై : డోమినోస్ పిజ్జా డెలివరీ బాయ్‌పై తమిళ నటి గాయత్రి సాయి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయత్రి ఇంటికి పిజ్జా తీసుకువచ్చిన డెలివరీ బాయ్ ఆ తర్వాత ఆమె ఫోన్ నెంబర్‌ను వాట్సాప్‌లోని పలు అడల్ట్ గ్రూప్స్‌లో షేర్ చేశాడు. దీంతో పలువురు ఆమెను వేధిస్తూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం, పోన్స్ చేయడం ప్రారంభించారు. వేధింపులతో ఆగ్రహానికి లోనైనా గాయత్రి.. తేనాంపేటలోని మహిళ పోలీస్ స్టేషేన్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే ట్విటర్ వేదికగా తనకు ఎదురైన వేధింపులను వివరించారు.
‘ఫిబ్రవరి 9న చెన్నైలోని నా ఇంటికి డోమినోస్ డెలివరీ బాయ్ పిజ్జా తీసుకుని వచ్చాడు. పిజ్జా డెలివరీ చేసే సమయంలో అతడు మత్తులో ఉన్నాడు. అతడు నా ఫోన్ నంబర్‌ను పలు అడల్ట్ గ్రూప్స్‌లో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించి అతని యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ.. అది పెండింగ్‌లోనే ఉంది. అతను నా నెంబర్ షేర్ చేయడంతో.. విపరీతమైన ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయ’ని గాయత్రి తెలిపారు. అలాగే పిజ్జా డెలివరీ బాయ్ ఫొటోను కూడా షేర్ చేశారు. తనకు వస్తున్న వాట్సాప్ మెసేజ్‌లను స్ర్కీన్ షాట్‌లను ఆమె ట్విటర్‌లో ఉంచారు. అలాగే తనకు సాయం చేయాల్సిందిగా తమిళనాడు పోలీసులను కోరారు. ఆన్‌లైన్‌లో ఆన్‌లైన్ యాప్‌లు తమ నెంబర్‌లు ఇతరులకు షేర్ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. మరోవైపు గాయత్ని ఫిర్యాదుపై పోలీసులు స్పందిస్తూ.. పిజ్జా డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. కాగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అంజలి చిత్రంతో గాయత్రి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆమె నటించారు.